సూపర్ స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరోయిన్ రానుందా..!
వరుసగా నాలుగు హిట్లను మహేష్ బాబు తన సొంతం చేసుకోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, జక్కన్న డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్న మహేష్ ఈ సినిమాలతో కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు సూపర్ స్టార్.
ప్రస్తుతం మహేష్ బాబు మేనకోడలికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ సోదరీమణులలో మంజుల ఒకరు కాగా మంజుల పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఆ సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నారు. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన మంజుల నిర్మాతగా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను తన సొంతం చేసుకోవడం గమనార్హం.
తాజాగా మంజుల తన కూతురికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగ వైరల్ అవుతున్నాయి. మహేష్ మేనకోడలు జాహ్నవి ఎంత క్యూట్ గా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు వర్షం చేస్తున్నారు. జాహ్నవి భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటుండగా ఆమె మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే మరి.
మహేష్ బాబు కుటుంబానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎక్కువమంది సక్సెస్ సాధించారు. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ తర్వాత షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ పూజా హెగ్డే కాంబో సన్నివేశాలను షూట్ చేయనున్నారు. సినిమాసినిమాకు మహేష్ పారితోషికం పెరుగుతుండగా మహేష్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలుగా తెరకెక్కుతున్నాయి అని తెలుస్తోంది.