వైరల్ అవుతున్న సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్...!!

murali krishna
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఈమె తన మొదటి సినిమా చేసే టైంలోనే నాగచైతన్య తో ప్రేమలో పడి ఆ తర్వాత కొన్ని రోజులు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారట.


ఇక నాలుగు సంవత్సరాలు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా తమ వివాహబంధాన్ని ఎంజాయ్ చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఎవరూ కలలో కూడా అనుకోని విధంగా విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి ఇటు కుటుంబ సభ్యులతో పాటు, అటు అభిమానులకు కూడా షాకిచ్చారు. ఇక విడాకుల తర్వాత సమంత నాగచైతన్య ఎవరి దారి వారు చూసుకుని సినీ కెరీర్ లో బిజీ గా అయిపోయారు. ఇక సమంత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తూ పోతుంది.


ఇక నాగచైతన్య కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. ఇక వీళ్లు విడిపోయి సంవత్సరం గడిచినా కూడా వీరి విడాకులపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెను అక్కినేని అభిమానులు టార్గెట్ చేస్తూ చేస్తూ ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారట. ఇక వారు సమంతను ఎంత టార్గెట్ చేసి ట్రోల్ చేసినా కూడా వాటికి బదులుగా సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియా కి కాస్త దూరంగా వుంటోంది సమంత. ఇక సమంత సోషల్ మీడియా కి దూరంగా ఉండడం వల్ల ఆమెపై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. సమంత కి స్కిన్ ప్రాబ్లం వచ్చిందని, గర్భసంచి తీయించుకుందని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ అబద్ధాలు అని సమంత మేనేజర్ తేల్చి చెప్పారు. ఇక ఈ మధ్యనే మళ్లీ సమంత సోషల్ మీడియా కి దగ్గర అయిందట.


సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో లో సమంత బ్లాక్ టీషర్ట్ వేసుకుంది. ఇక టీ షర్ట్ పైన యు విల్ నెవర్ వాక్ ఎలోన్ అని రాసి ఉంది. ఇక టీ షర్ట్ పైన ఉన్న మ్యాటర్ నే సమంత క్యాప్షన్ లా రాసి లవ్ సింబల్ కూడా పెట్టింది. అయితే దీని అర్థం నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయలేవు. అయితే సమంత పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. అయితే దీన్ని చూసిన చాలా మంది నెటిజెన్లు నాగచైతన్యను ఉద్దేశించే సమంత ఈ పోస్ట్ చేసింది అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే చైతన్య ఈ మధ్యనే ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి. అందుకే సమంత ఇలా ఇన్ డైరెక్ట్ గా నాగ చైతన్య పై సెటైర్ వేసింది అని చాలా మంది భావిస్తున్నారు. ఇక ఈ పోస్టు చైతన్య ను ఉద్దేశించి చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: