నాగార్జున 100వ చిత్రంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది...!!

murali krishna
హైదరాబాద్‌: టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగార్జున మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వందో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాగ్‌... దీని కోసం ఓ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. 'గాడ్‌ఫాదర్‌' లాంటి భారీ హిట్‌ను చిరం జీవికి అందించిన మోహన్‌రాజాతో ఈ సినిమా ఉండనుంది. ఈ విషయం గత కొద్ది రోజులుగా కొంత మంది నోట వింటున్నా.. అది నాగార్జు న వందో సినిమానా? కాదా? అనే డౌట్‌ ఉండేది. ఇప్పుడది క్లియర్‌ అయ్యింది.
నాగార్జున తన 100వ సినిమా కోసం గ్రాం డ్‌గా ప్లాన్‌ చేస్తు న్న దీనిపై ఒకరిద్దరు దర్శకులతో చర్చించారట. అయితే మోహన్‌రాజా చెప్పిన కథ నచ్చడంతో.. పచ్చ జెండా ఊపేశారట. ఈలోపు చిరంజీవి నుంచి రిక్వెస్ట్‌ రావడంతో మోహన్‌రాజా 'గాడ్‌ఫాదర్‌' చేసుకోవడానికి నాగ్‌ ఓకే చేశారట. ఈ విష యాన్ని 'గాడ్‌ఫాదర్‌' నిర్మాతల్లో ఒకరైనా ఎన్వీ ప్రసాద్‌ ఇటీవల చెప్పారు. మరోవైపు నాగ్‌ సినిమా కు  స్క్రిప్ట్‌ ఇ ప్పటికే సిద్ధమైం దని, మరోసారి అంతా చెక్‌ చేసు కుని సినిమా స్టార్ట్‌ చేస్తామని కొన్ని రోజుల క్రితం మోహన్‌రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇదిలా ఉండగా.. సినిమాలకు ఆరు నెలల గ్యాప్‌ ఇస్తానని ఆ మధ్య 'ది ఘోస్ట్‌' ఇంట ర్వ్యూల్లో నాగార్జున అన్నారు. ఇవన్నీ చూస్తుం టే.. ఆరు నెలల తర్వాత అంటే వచ్చే సమ్మర్‌ లో నాగార్జున - మోహన్‌ రాజా సినిమా ఉంటుంది. అన్నట్లు ఈ సిని మా లో అఖిల్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట. మంచి ఎమోషన్స్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేశానని మోహన్‌రాజా ఇప్పటికే వెల్లడించారు. సో.. నాగార్జున మైల్ ‌స్టోన్‌ సినిమా పనులు త్వ రలో ప్రారం భ మవుతాయి. అప్పుడు మరిన్ని అప్‌డేట్స్‌ వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: