రామ్ చరణ్ చిత్రంపై నమ్మకాన్ని పెంచిన డైరెక్టర్ శంకర్..!!
అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమా షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని ఇటీవలే తిరుపతిలో భారతీయుడు-2 సినిమా షెడ్యూల్ ని కూడా ముగించారని మరో 10 రోజుల్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ని మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా ప్రాజెక్టుల పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా సమాచారం. దిల్ రాజుతో కలిసి పనులు కూడా చాలా చకచగా పూర్తి చేసేందుకు సహకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇక సంగీతం కోసం థమన్ ని కూడా కలవడం జరిగిందట దీంతో ఇలా పనులన్నీ పూర్తి చేయడంతో అభిమానులకు RC -15 సినిమా పైన కాస్త భరోసా పెరుగుతోందని చెప్పవచ్చు సమాచారం. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ రాత్రి సమయాలలో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాతో కచ్చితంగా మరొక విజయాన్ని అందుకోవాలని చాలా కసితో ఉన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.