బుచ్చిబాబు ను కన్ఫర్మ్ చేసినట్లేనా!!

P.Nishanth Kumar
ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని చాలా రోజుల నుంచి తిరుగుతున్న ఈ దర్శకుడు ఇంకా తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టకపోవడం నిజంగా ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.

వాస్తవానికి అంత పెద్ద విజయం అందుకున్న తరువాత ఏ దర్శకుడైన వెంటనే సినిమా మొదలు పెట్టాలి కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ కోసం వేచి చూడడం కోసం రెడీ అవుతుండడంతో తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు సినిమా చేయడానికి మరికొంత సమయం పట్టడం ఇప్పుడు ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చూసుకుంటే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టు కోవాల్సి ఉంది. 

అంతే కాదు ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.  ఆ విధంగా ఈ రెండు సినిమాలను చేసిన తరువాత కానీ ఎన్టీఆర్ ఫ్రీ అవ్వడు కాబట్టి అప్పుడే బుచ్చిబాబుతో సినిమా చేస్తానని తేల్చి చెప్పేశాడట. అయితే ఈ గ్యాప్లో ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని బుచ్చిబాబు సన్నిహితులు చెబుతున్న కూడా డివియెట్ అవ్వకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఈ సినిమా పైన మాత్రమే వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు. ఏదేమైనా బుచ్చిబాబు ఉప్పెన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఆయన కెరియర్ కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. హిట్ దర్శకులేవారు కూడా తదుపరి సినిమా కోసం ఇంత సమయాన్ని తీసుకోవడం జరగదు. ఈ నేపథ్యంలో బుచ్చి బాబు మరోసారి ఆలోచిస్తే మరీ మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: