ఆ సినిమా కోసం ఏకంగా అన్ని కోట్లు అందుకుంటున్న థమన్..!!

Divya

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని చెప్పవచ్చు. కిక్ సినిమాతో మొదటిసారిగా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన థమన్ ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా తన సంగీతాన్ని అందిస్తున్నారు. చిన్నచిన్న హీరోలతోపాటు స్టార్ హీరోలతో కూడా పలు సినిమాలో సంగీతాన్ని అందించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలా వైకుంఠపురం సినిమాకు కాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని నేషనల్ లెవెల్ లో అందుకున్నారు.


ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి రీసెంట్గా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు థమన్. అంతేకాకుండా రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లు ఒక సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రిలిల నటిస్తున్నది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎంపిక చేయడం జరిగింది గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రానికి కూడా థమన్ సంగీతాన్ని అందించారు.



ఇప్పుడు మరొకసారి బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాకి తన పవర్ ఫుల్ మ్యూజిక్ ని అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకీ థమన్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి ఏకంగా రూ.4 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా ఇంత డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: