ఆదిపురుష్‌ పై ఆశక్తి కారమైన వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖాన్నా..!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై ఎదో ఒక వివాదం ముదురుతూనే ఉంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఈ టీజర్ పై మండిపడ్డ విషయం మనకు తెలిసిందే.
ఆదిపురుష్‌ ను విమర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పురాణపురుషులను ట్రెండీ చూపించడం ఏంటనే ప్రశ్న అందరి నుంచి వస్తోంది. ఇక తాజాగా ఇదే విషయంపై శక్తిమాన్ ఫేమ్‌ ముఖేష్ ఖాన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ , సైఫ్ ఆహార్యంపై ఆయన సీరియస్ గా మాట్లాడారు. రాముడు, హనుమంతుడు, రావణాసురుడు కనపడలేదన్నారు. రాముడు, కృష్ణుడు అర్నాల్డ్ ష్క్వార్జ్‌ నెగర్‌లా ఉండరన్నారు ముఖేశ్ ఖన్నా. హిందూ దేవుళ్లు రాముడు, కృష్ణుడు వినయ, విధేయతలతో ఉంటారన్నారు. బాడీ బిల్డర్స్ రూపంలో ఉండరని, రామునికి, హనుమంతునికి అసలు మీసాలే ఉండవని అన్నారు.
రాముడు రాముడిలా, హనుమాన్‌ హనుమంతుడిలా కనిపించడం లేదు అని అన్నారు. ఇతిహాసగాథ రామాయణాన్ని 'ఆదిపురుష్‌' తరహాఓ తీస్తే కుదరదని 'శక్తిమాన్' పాత్రధారి ముఖేష్‌ ఖన్నా గట్టిగానే చెబుతున్నారు ముఖేష్‌ ఖన్నా తో యాక్టరస్ దీపికా చిక్లియా కూడా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు. లో పాత్రలు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలన్నారు.. ఏ పాత్ర వేసినా.. అది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నారు.
దేవుళ్ళ మొహాల్లో కోమలమైన సౌందర్యం ఉంటుంది. మరియు ఎంతో సున్నితంగా, ఎంతో విధేయతతో ఉంటాయి. అంతే తప్ప గడ్డాలు,  ఉండవు అని అన్నారు శక్తిమాన్. ఆదిపురుష్‌'ను ఫిక్షనల్‌ స్టోరీ అని చెప్పండి.. అంతేకానీ దయచేసి రామాయణం అని చెప్పకండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు, శక్తి మ్యాన్ ఫేమ్ మాట్లాడుతూ మీసాలు లు తో కూడిన సన్నివేశాలు సినిమా లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా సినిమా లో మరి కొన్ని సన్నివేశాలను తొలగించితె అందరికీ బాగుంటుందని ఆయన అన్నారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి అని ఆయన పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: