సైఫ్ ఆలీఖాన్ లుక్ తనకు నచ్చ లేదు అంటున్న బిగ్ డైరెక్టర్..!!
ఈ సినిమా రామాయణం కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది అని మనకు తెలుసు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొత్తం గ్రీన్ మ్యాట్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ టీజర్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లుతాయి. అసలు రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడికి గడ్డం మీసాలు ఉండడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున రాముడి లుక్ పై విమర్శలు చేశారు. అలాగే రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ చూడగానే రావణాసురుడిలా అనిపించలేదు అంటూ చాలామంది ఈ సినిమాపై విమర్శలు చేస్తూ వచ్చారు అయితే తాజాగా ఆది పురుష్ సినిమా టీజర్ పై సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర సినిమా టీజర్ విడుదలైనప్పుడు చాలామంది వీఎఫ్‌ఎక్స్ అసలేం బాలేదని బాగా ట్రోల్ చేశారు.
అయితే సినిమా విడుదలైన తర్వాత ఎవరు వీటి గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాలు స్మాల్ స్క్రీన్ కన్నా బిగ్ స్క్రీన్ లోనే ఎంతో పర్ఫెక్ట్ గా కనపడతాయి.కాబట్టి ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయకూడదని ఈయన తెలిపారు.రామాయణం అంటే ఇలాగే ఉంటుంది రాముడు అంటే ఇలాగే ఉంటారు అనే విషయం మనకు తెలుసు కాబట్టే ఈ సినిమాలో ప్రతి ఒక్కరి లుక్ పై తప్పు పడుతున్నాము. ఈ టీజర్ విడుదలైన తర్వాత నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి అసలు రాముడు మీసాలుతో ఉండడం ఏంటి అంటూ ప్రశ్నించారు.అయితే రాముడిని మీసాలతో చూపించాలని వాళ్లు అనుకున్నారేమో అందుకే అలాగే చూపిస్తున్నారంటూ వర్మ తెలిపారు. నిజానికి సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి లుక్ చూసిన తర్వాత నాక్కూడా నచ్చలేదని తెలిపారు. చిన్నప్పటినుంచి రావణాసురుడు అంటే గంభీరమైన మొహం పొడువాటి చుట్టూ ఉన్నటువంటి ఎస్వీ రంగారావు గారిని చూసి ఒక్కసారిగా సైఫ్ అలీఖాన్ ను చూసేసరికి తనకు కూడా ఆయన లుక్ నచ్చలేదని వర్మ తెలిపారు.