పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ కు సై అన్న సాయిపల్లవి....!!
హీరోల్లో బన్నీ, చెర్రీ, తారక్ ఏవిధంగా డ్యాన్స్ లో కుమ్మేస్తారో.. హీరోయిన్ల విషయానికొస్తే సాయిపల్లవి డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం. హీరోయిన్ సాయిపల్లవి ఈ మధ్యకాలంలో నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.
అందులో లవ్ స్టోరీ, విరాటపర్వం, గార్గి ఈ మూడు సినిమాలు బాక్సా ఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తెగ నిరాశ పరిచాయి.ఈ క్రమంలో ఆమె దూకుడు కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు వరుస సినిమాలతో జోరు మీదున్న సాయిపల్లవిజ.. తన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఈ సందర్భం గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవు తున్నాయి. నా వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు.
వాళ్లు నన్ను నమ్మి నా సినిమాల కోసం ఇంత కష్టపడు తుంటే సరైన స్టోరీలు ఎంపిక చేసుకోకుండా ఏమరపాటుగా వ్యవహించినట్టు తన తప్పును అంగీకరించినట్టు జోరుగా కథనాలు వెలువడ్డాయి. తాజాగా సాయిపల్లవి అభిమానులు పండగ చేసుకునే రోజు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో గా దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపికవ్వగా.. సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట.. అదే నిజం అయితే అటు పవన్ ఫ్యాన్స్, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ విని పిస్తుంది.వీరిద్దరి మధ్య ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుం దని టాక్ వస్తోందిఅదే సినిమా కు హైలెట్ గా నిలవనుందట..