తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని బాగా పెంచాడు. ఈ ఏడాది 'బీస్ట్'తో అభిమానులను చాలా దారుణాతి దారుణంగా నిరాశపరిచిన విజయ్..వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న 'వారసుడు' సినిమాతో ఎలాగైన బ్లాక్‌బస్టర్ సాధించాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే.. విజయ్, లోకేష్ కనగరాజు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో విజయ్ కి జంటగా త్రిష నటిస్తుందని సమాచారం తెలుస్తుంది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజు.. ‘LCU’లో భాగంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. ‘విక్రమ్’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉండనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఈ వార్తతో సినీ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్‌ను ఎంపిక చేసినట్లు టాక్. ఇటీవలే విక్రమ్‌తో భారీ విజయాన్ని సాధించిన లోకేష్ కనగరాజు.. ఈ చిత్రంతో ఇంకెంత విధ్వంసాన్ని సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్ లో బీస్ట్ సినిమా వచ్చి కరోనా పాండమిక్ లోనే పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా కూడా దాన్ని మించి హిట్ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.