చివరికి చిరంజీవి కోరిక తీరినట్లేనా..?

Divya
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే అక్కడక్కడ కొన్ని నెగటివ్ ప్రచారాలు జరిగినప్పటికీ పెద్దగా అవి ఈ సినిమా పైన ప్రభావం పడలేదని చెప్పవచ్చు.. ఇక డైరెక్టర్ మోహన్ రాజా లూసిఫర్ సినిమాని చేంజ్ చేసి ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. చాలావరకు ఇందులోని సన్నివేశాలలో చిరంజీవిను బాగా పవర్ ఫుల్ గా చూపించినట్లుగా ప్రేక్షకుల సైతం భావిస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి కోరిక కూడా తీరిందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.
ఏది ఏమైనా కలెక్షన్ల పరంగా పక్కన పెడితే చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో మొదటిరోజు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి హీరోయిన్, డ్యూయెట్ సాంగ్స్ లేకుండా సక్సెస్ కొట్టిన సందర్భాలు అంతగా లేవని చెప్పవచ్చు. ఇక అప్పట్లో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమా చాలా నిరాశకు గురిచేసింది. కానీ ఆ చిత్రానికి అవార్డులు వచ్చినప్పుడు ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోయిందని డిసప్పాయింట్తో అభిమానులు ఉన్నారు. ఇక అంతే కాకుండా డాడీ సినిమా సమయంలో కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చిరంజీవి అందులో కూడా కమర్షియల్ అంశాలు ప్రయోగం చేసిన సక్సెస్ కాలేదు.

ఫ్యాన్స్ కోరిక మేరకు రొటీన్ సినిమాలు చేయడం వల్ల బోర్ కొట్టేసిందని ఈసారి గాడ్ ఫాదర్ సినిమాతో కరెక్ట్ అని రామ్ చరణ్ ఒప్పించి మరి ఈ సినిమాని చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా లూసిఫర్ సినిమా అనగానే మెగాస్టార్ కు ఏమాత్రం కరెక్ట్ కాదని అందరూ భావించారని చెప్పవచ్చు.కానీ డైరెక్టర్ తెలివితో ఈ సినిమాకి న్యాయమైతే చేశారని చెప్పవచ్చు ఈ సినిమా సక్సెస్ సంబంధం లేకుండా మెగాస్టార్ కు సంతృప్తినిచ్చే సినిమాగా ఈ సినిమా రిజల్ట్ అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: