హంట్: సినిమాతో సక్సెస్ సాధించేలా ఉన్న సుధీర్ బాబు..!!
ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో డైలాగులు సైతం కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నాయని చెప్పవచ్చు.సామాన్య మనుషుల సంఘటనలు, వ్యక్తిగత జీవితం గురించి ఈ టీజర్ లో చూపించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మరొకసారి సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తనకు అనుకోకుండా ఒక కేసు వస్తుంది ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది ఈ సినిమా కథ అన్నట్లుగా ఈ టీజర్ చూస్తే కనిపిస్తోంది. ఇక హీరో శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గానే కనిపిస్తున్నారు.
ఇప్పటివరకు సుధీర్ బాబు కెరియర్ లో ఇలాంటి సినిమాలు నటించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సోదరి మంజుల కూడా కనిపించనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం మహేష్ వ్యవహరిస్తున్నారు. భవ్య క్రియేషన్ బ్యానర్ పై విచిత్రాన్ని నిర్మించడం జరుగుతోంది. మరి ఈ సినిమాతో నైనా సుధీర్ బాబు సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.