బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో భారీ గానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పవచ్చు. ఒకవైపు మ్యాగజైన్ కవర్ ఫోటోలతో కుర్రకారులకు సైతం చెమటలు పట్టిస్తుంటే మరొకసారి కిల్లర్ హాట్ లుక్ ఫోటోలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంటోంది.
ఇక కీయారా యూత్ ఐకాన్ గా అభిమానులు ఫీల్ అవుతున్నారు అంటే కియారా అద్వాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. తాజాగా జిక్యూ కవర్స్ కోసం తన ప్రిపరేషన్ ఎలా సాగిందో అనే విషయాన్ని బయట పెట్టింది ఇదివరకు మ్యాగజైన్ సూట్ నుంచి పలు రకరకాల డిజైన్ లుక్కులను బయటపెట్టిన కీయరా అద్వాని తాజాగా సరికొత్త లుక్కును రివిల్ చేయడం జరిగింది. ఈ లుక్ చూశాక అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది కియరా అద్వాని సర్ప కన్య లాగా చూస్తోంది అంటు కామెంట్లు చేస్తూ ఉన్నారు.
కియరా అద్వానీలో ఆమె కళ్ళు ఆమెకు అందమని చెప్పేలా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇక అందమైన పెదాలు పై వేలితో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో బాగానే దూసుకుపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రంపై భారీగానే నమ్మకం పెట్టుకున్నది ఈ ముద్దు గుమ్మ.