30 ఇయర్స్ కమెడియన్ పృథ్వి కి భారీ షాక్ ఇచ్చిన కోర్టు.. నెలకు 8 లక్షలు కట్టాలంటూ..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీరాజ్.ఈయన  చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగా స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్.ఇకపోతే టాలీవుడ్ లో మంచి పేరుతో పాటు.. పొలిటికల్ ఇమేజ్ కూడా సాధించిన ఈ స్టార్ కమెడియన్ బాగా సంపాదించారు కూడా.రీసెంట్ గా ఈ స్టార్ కమెడియన్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్డ్ లో ఎదురుదెబ్బ తగిలింది. ఇక పృథ్వీరాజ్ భార్య వేసిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్డ్.అయితే పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల 8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆయన్ను ఆదేశంచింది న్యాయస్థానం. 

ఇక కింద స్థాయి నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగిన పృథ్విరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి ని 1884 లో వివాహం చేసుకున్నారు. ఇకపోతే తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ - శ్రీలక్ష్మీ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.అయితే  శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. ఇక సినిమాలు, సీరియళ్ల ద్వారా బాగా సంపాధిస్తున్న తన భర్త తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆమె ఆరోపించారు.పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లిసినిమా ప్రయత్నాలు చేసేవారని.ఇక  ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు.

తనను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ.. వేధించేవాడని ఆరోపించారు. అంతేకాదు నోటికొచ్చింది తిడుతూ తనను చిత్ర హింసలుపెట్టాడంటూ ఆమె ప్యామిలీ కోర్డ్ ను ఆశ్రయించారు. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా ఇలానే చేస్తూ.. చివరకు తనను 5 ఏప్రిల్ 2016న తనను ఇంటి నుంచి గెంటేశాడని, దీంతో మరో దారిలేక పుట్టింటికి వెళ్ళానని ఆమె ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. అంతేకాదు దాదాపు నాలుగేళ్లకు పైగా కోర్డ్ లో కోనసాగిన కేసుపై ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది.అయితే కేసును విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు చెప్పారు.ఇక  ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలని ఆదేశించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: