శ్రీను వైట్లతో మంచు విష్ణు సినిమా అటకెక్కినట్టేనా..?

frame శ్రీను వైట్లతో మంచు విష్ణు సినిమా అటకెక్కినట్టేనా..?

Anilkumar
డైరెక్టర్ శ్రీను వైట్ల సినిమాలంటే కామెడీకి పెట్టింది పేరు  అనే చెప్పాలి.ఇక  ఫ్యామిలీ కథలకు కొట్టిన పిండి.  ఇవన్నీ ఒకప్పుడు బాగా వర్కౌట్ అయ్యాయి కాని ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు వగరుగా తయారయ్యాయి ఆడియన్స్ నుకు దాంతో చాలా కాలంగా సరైన సినిమా లేక..చేసిన సినిమాలు హిట్ అవ్వక కొట్టు మిట్టాడుతున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల.అయితే శ్రీను సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. ఇక తన మార్క్ కామెడీతో టాలీవుడ్ లో స్పెషల్ డైరెక్టర్ గా ఓ బ్రాండ్‌ ఇమేజ్ సాధించిన దర్శకుడు.. ఇప్పుడు సరైన విజయాలు లేక రేసులో వెనకబడ్డారు.

అయితే  ఆ మద్య మంచు విష్ణుతో సినిమా చేయబొతున్నట్టు ప్రకటించాడు శ్రీను. ఇకపోతే వీరిద్దరి కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశాడు.ఇక  సినిమా అనౌన్స్ చేశారు.కాగా  టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆతరువాత ఏమయ్యిందో ఏమో కాని.. ఈ సినిమాపై అస్సలు ఎవరూ మాట్టాడలేదు. ఇక అటు విష్ణు కూడా జిన్నా సినిమాపై ఫోకస్ పెట్టాడు.ఇకపోతే అమర్‌ అక్బర్‌ ఆంథోని సినిమా తరువాత శ్రీను వైట్లకు దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. ఇక ఆసినిమాపై శ్రీను చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే మాస్ మహారాజ్ తో మెమరబుల్ హిట్ కొట్టాలని కలలు కన్నాడు.

కష్షపడ్డాడు.  ఆసినిమా డిజాస్టర్ కావడంతో కోలుకోనేకపోయాడు శ్రీను వైట్లు. ఇదిలా ఉంచితే  తాజా సమాచారం ప్రకారం గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల ఓ ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాకు గోపీమోహన్‌ కథను అందిస్తున్నారని సమాచారం.అంతే కాదు  శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గోపీచంద్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని,సినిమా సెట్స్ మీదకు వెళ్ళడమే తరువాయి అని ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.అయితే  ఒకప్పుడు తన సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన శ్రీను వైట్ల.. తరువాత తరువాత అంత మంచి సినిమాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో తెలియడంలేదు.  ఈసారైనా హిట్ కథతో ఆడియన్స్ ముందుకు వస్తాడేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: