జక్కన్న బ్రహ్మస్త్రని సపోర్ట్ చెయ్యడానికి కారణం అదే?

Purushottham Vinay
పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన బ్రహ్మాస్త్ర మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. అయితే వీక్ డేస్ లో కలెక్షన్లు భారీగా డ్రాప్ కావడం గమనార్హం.అయితే బ్రహ్మాస్త్ర సినిమాను ప్రమోట్ చేయడానికి జక్కన్న కరణ్ జోహార్ నుంచి ఏకంగా 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది.రాజమౌళి ఈ సినిమా కోసం రూపాయి కూడా తీసుకోలేదని బాహుబలి1, బాహుబలి2 సినిమాలు హిందీలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి కరణ్ జోహార్ తన వంతు సహకారం అందించిన నేపథ్యంలో బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించడానికి రాజమౌళి కూడా తన వంతు సహాయసహకారాలు అందించారని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో ఈ సినిమాను రాజమౌళి స్నేహితుడైన సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు.



బ్రహ్మాస్త్ర సినిమాను రాజమౌళి ప్రమోట్ చేయడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.అయితే బ్రహ్మాస్త్ర సినిమాకు హిందీలో మాత్రం నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్1 ఆశించిన స్థాయిలో విజయం సాధించని నేపథ్యంలో బ్రహ్మాస్త్ర పార్ట్2, బ్రహ్మాస్త్ర పార్ట్3 విషయంలో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.బ్రహ్మాస్త్ర పార్ట్2 దిశగా అడుగులు పడకపోవచ్చని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కరణ్ జోహార్ కు ఈ సినిమా ఫలితం ఒక విధంగా షాకిచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లు ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇక రాజమౌళి తన తరువాత సినిమా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకుండానే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: