విజయ్ దేవరకొండకు సమస్యగా మారిన సమంత..?

Anilkumar
తాజాగా ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ , సమంత.జంటగా నటిస్తున్న సినిమా ఖుషి . ఇక శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇకపోతే ఇటీవల  విడుదలైన పుష్ప' తర్వాత సమంతకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా' పాట సూపర్ హిట్టవడంతో.. ఆ తర్వాత నుంచి సమంత  వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు వరస ఒప్పేసుకుంటోంది. కాగా సమంత కు క్రేజ్ రావటం ప్రస్తుతం ఆమెతో సినిమా చేస్తున్న నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే కానీ...ఆమె వల్ల తమ ప్రాజెక్టు డిలే అవుతోందని గోలెత్తిపోతున్నట్లు సమాచారం.

ఇటీవల లైగర్ సినిమా డిజాస్టర్ తో నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ తమ తాజా చిత్రం ఖుషీతో ఒడ్డున పడదామనుకుంటున్నారు. అయితే సమంతతో తన కాంబినేషన్ హిట్ అవుతుందని నమ్మి ముందుకు వెళ్తున్నారు.అదే సమంత డేట్స్ విషయంలో క్లాష్ వచ్చి ప్రాజెక్టు లేటు అవుతోందని భావిస్తున్నారట.అయితే  వాస్తవానికి అక్టోబర్ రెండవ వారం నుంచి ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉమంది. సమంత డేట్స్ దొరక్క ఆగారని తెలుస్తోంది.ఇక  ఆమె కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ తో తీయాల్సిన సీన్స్ అవి.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత పరిస్థితి కూడా అంతే.ఈమె కమిటవడానికి వరుసగా సినిమాలు కమిటైంది గానీ..

అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి.కాగా  గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.అంతేకాదు  అలాగే, యశోద కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. కీతే వాస్తవంగా ఆగస్టు 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.  పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.కాగా దర్శకుడు శివ నిర్వాణ కూడా తన గత చిత్రం టక్ జగదీష్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇకపోతే నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ నానితో తీసిన టక్ జగదీష్ మాత్రం ఫ్లాపయి షాకిచ్చింది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: