రాజమౌళి వెంటపడుతున్న ప్రముఖ నిర్మాత.. కారణం..?
ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయారని చెప్పవచ్చు.. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా కూడా ఉండి ఈ సినిమా విజయంలో తన వంతు భాగంగా ప్రోత్సహించడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక నిర్మాత రాజమౌళి వెంట పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ప్రజెంట్ పలు సినిమాలను నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నారు. రాజమౌళి అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం మగధీర. ఇక తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమాని కూడా చేయలేదు.
అయితే ఇప్పుడు మరొకసారి అల్లు అరవింద్ మహాభారతం కోసం రాజమౌళిని సహాయం అడిగేందుకు ముందుకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మహాభారత్ పేరుతో ఒక కార్టూన్ ద్వారా కథ చెప్పాలని అల్లు అరవింద్ ఒక ప్రాజెక్టుని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇందులో రాజమౌళి హ్యాండ్ కూడా పడితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి మరింత సహాయం అవుతుంది అని అల్లు అరవింద్ భావించడంతో.. ఈ విషయంపై రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి రాజమౌళి భాగస్వామిగా చేసుకోవడానికి అల్లు అరవింద్ అందుకోసం చర్చలు జరుపుతున్నట్లుగా కూడా వార్త వినిపిస్తోంది. మరి రాజమౌళి ఒప్పుకుంటాడు లేదో చూడాలి మరి.