కోబ్రా: మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది?

Purushottham Vinay
తమిళ విలక్షణ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరో. విక్రమ్ నటనకి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఫిదా అయిపోతుంటారు. ఇక చియాన్ విక్రమ్ రీసెంట్ గా నటించిన మూవీ 'కోబ్రా'. ఈ సినిమా రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం.ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే స్వల్ప నష్టాలతో సేఫ్ అయింది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ యావరేజ్ మూవీగా నిలిచింది.


ఇక ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తీరు ఊహించిన స్థాయిలో అయితే ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే థియేటర్ల నుండి మాయమైంది. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే థియేటర్లలో కాకుండా ఈసారి ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ కోబ్రా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 31న ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు సోనీ లివ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ రోజున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త ఫెయిల్ అయిన కోబ్రా, ఓటీటీలో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: