లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి నిండా మునిగిపోయారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే ఈ సినిమాను భారీ ధరలకు అమ్ముకున్న వారిద్దరు కూడా బాగానే సేఫ్ అయ్యారు.ఛార్మి మాత్రం చాలా హ్యాపీ అన్నమాట వినిపిస్తుంది. లైగర్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే వాళ్లకు బాగానే మిగిలిందని ట్రేడ్ వర్గాల అంచనా. లైగర్ చిత్రాన్ని రూ. 60 నుండి 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అన్ని భాషల్లో కలిపి రూ. 90 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే దాదాపు రూ. 20 కోట్ల లాభం వచ్చింది.లైగర్ బిజినెస్ లో కేవలం 35 శాతం మాత్రమే రికవరీ చేసింది. బయ్యర్లకు నష్టాల్లో కొంత తిరిగి చెల్లించాల్సి ఉంది.ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన లాభాలు బయ్యర్లకు ఇచ్చేసినా లైగర్ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తో కనీసం ముప్పై కోట్లకు పైగా పూరి-ఛార్మిలకు దక్కుతాయి. అంటే లైగర్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నిర్మాతలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. బయ్యర్లు మాత్రం నష్టపోయారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో చాలా నష్టపోయారు.
ఒప్పందం ప్రకారం విజయ్ దేవరకొండకు రెమ్యూనరేషన్ గా రూ. 25 కోట్లు చెల్లించాలి. లైగర్ విడుదలకు ముందే జనగణమన సేమ్ కాంబినేషన్ లో స్టార్ట్ చేశారు.ఆ కారణంతో పాటు లైగర్ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్న విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో కేవలం 25% మాత్రమే తీసుకున్నారట. చెప్పినట్లు రూ. 25 కోట్లు ఇవ్వకున్నా ఎంతో కొంత తిరిగి చెల్లిస్తారని విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నాడట. జనగణమన సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తుండగా, లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఛార్మి-పూరిలు ఇవ్వలేదట.పాపం విజయ్ కూడా గట్టిగా అడగలేకపోతున్నారట.ఏది ఏమైనా విజయ్ ఈ సినిమాతో పెద్ద గుణ పాఠం నేర్చుకున్నాడు. దేశావ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇంకా వెనకబడే వున్నాడు. ఇక మీద నుంచైనా మంచి కథలు ఎంచుకోవాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.