కృష్ణంరాజు చనిపోతే కనీసం అలా చేయలేరా అంటూ ఆర్జీవీ ఫైర్..!
ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీ పై మండిపడడం జరిగింది. కృష్ణంరాజు మృతికి నివాళులు అర్పిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగులు ఆపకపోవడం పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణంరాజు వంటి గొప్ప మహానటుడు కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినీ పరిశ్రమకు నా జోహార్లు.. సిగ్గు.. సిగ్గు.. అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం.. ఆయనకు వీడ్కోలు ఇవ్వకపోవడం మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.
అంతేకాదు కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తూ కనీసం రెండు రోజులైనా షూటింగులు ఆపుదామంటూ తెలుగు సినీ పెద్దలను ట్యాగ్ చేసి మరీ పిలుపునిచ్చారు రాంగోపాల్ వర్మ.. మరి రాంగోపాల్ వర్మ చేసిన ట్వీటుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మాత్రం చాలా గొప్పగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధాకరమైన చెప్పాలి.అంతేకాదు కచ్చితంగా కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తూ టాలీవుడ్లో షూటింగులు ఆపివేయాలని కూడా నెటిజెన్లు కోరుతున్నారు.