టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఇక ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకొని ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.ఇక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతోఇకపోతే ఈ సినిమాపై సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖుల సైతం ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా ద్వారా నిఖిల్ నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫేమ్ పొందారు. ఇక ఈ సినిమా ఇప్పటికీ పలుచోట్ల థియేటర్లలో రన్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది.అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 భారీ ధరలకు కొనుగోలు చేశారు.ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలబడనుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికీ పలుచోట్ల రన్ అవుతూ మంచి కలెక్షన్లను రాబట్టింది.
అయితే ఈ సినిమా విజయం పై ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా త్వరలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సినిమా విషయంపై హీరో నిఖిల్ కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో నిఖిల్ తదుపరి చిత్రాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈయన తదుపరిచిత్రం 18 పేజెస్.ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.ఇక ఇందులో కూడా అఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాని కేవలం సౌత్ లో మాత్రమే విడుదల చేయాలని భావించినప్పటికీ కార్తికేయ2 హిట్ కావడంతో ఈ సినిమాని హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది..!!