పూజా హెగ్డే అందాల ఆరబోత ఫోటోలు వైరల్..!!

Divya

వరుస ప్లాప్ లతో తన కెరియర్లు చుట్టూ మూడుతున్న కానీ తన మెరుపు అందాలను మాత్రం తగ్గించలేదు ముద్దుగుమ్మ పూజ హెగ్డే.ప్రస్తుతం ఉత్తరాది సినిమాలలో కెరియర్ పరంగా తీరిక లేకుండా నటిస్తూ ఉన్నది. ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా ఈరోజు సండే కావడం చేత విజువల్ ఫోటోలను సైతం షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతూ ఉన్నాయి.
బ్రౌన్ కలర్ డ్రెస్ లో కలర్ ఫుల్ టాప్ తో పూజా హెగ్డే చాలా మెరిసిపోతూ కనిపిస్తోంది. తన చిరునవ్వుతో తన అందాలను చిందిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది పూజా హెగ్డే. ఈ లుక్కులో పూజ అందాలను మైమరిపించేలా ఉన్నాయని చెప్పవచ్చు. అలా వైకుంఠపురం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న పూజ హెగ్డే ఆ తర్వాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. మళ్లీ భారీ సినిమాలతో తిరిగి అభిమానుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కభీ ఈద్ కబీ , దీపావళి, భాయిజాన్ తదితర సినిమాలలో నటిస్తూ ఉన్నది. పూజా హెగ్డే వాళ్ళ హైదరాబాదులో భాయిజాన్ సినిమా లోని ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ లతో కలిసి పూజా హెగ్డే స్క్రీన్ ని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న జనగణమన సినిమాలో నటిస్తున్నది. పూజా హెగ్డే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన అందమైన చిరునవ్వుని ఎప్పుడూ చూపిస్తూ ఉంటుంది. అలాగే సెట్ లో ఉండే వారందరితో కూడా చాలా సంతోషంగా ఉంటూ సినిమా షూటింగును పూర్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుచేతనే దర్శకనిర్మాతలు ఇమే అడిగినంత ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు. నిరంతరం జిమ్, యోగ వంటివి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: