తన తండ్రి పాటకి మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన శృతిహాసన్..!!

Divya
శృతిహాసన్ తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక అంతే కాకుండా తన దగ్గరకు వచ్చిన ఎటువంటి సినిమా నైనా ఎవరితోనైనా నటించడానికి సిద్ధమైంది. ముఖ్యంగా శృతిహాసన్ డ్రెస్సింగ్ సెన్స్ మేకప్ పరంగా పలు ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా ఎప్పుడు నలుపు రంగును ధరిస్తూ ఉంటుంది. తాజాగా శృతిహాసన్ లేటెస్ట్ జంప్ సూట్ లో బ్లాక్లు ఫోటోలను చాలా వైరల్ గా ఒక వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.
ఈ డ్రెస్ లో శృతిహాసన్ చాలా హాట్ గా కనిపిస్తోంది.బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో తగ్గట్టుగానే తన బ్లాక్ బూట్లతో శృతిహాసన్ డాన్స్ స్టెప్పులు వేయడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.. అంతేకాకుండా జంపింగ్ స్టెప్పులు కూడా వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కమలహాసన్ క్లాసిక్ ట్యూన్ కి ఈ ముద్దుగుమ్మ మెసమరైజింగ్ స్టెప్పులు వేయడంతో బాగా ఈ వీడియో వైరల్ గా మారుతుంది శృతిహాసన్ ఇటీవల డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ టర్కీలో జరుగుతోంది.

ఇక అప్పుడప్పుడు బాలకృష్ణతో దిగిన కొన్ని సెల్ఫీ వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో దునియా విజయ్ మొదటిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే శృతిహాసన్ చిరంజీవితో కలిసి 154 వ సినిమాలో నటించబోతోంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు రవితేజ కూడా నటిస్తున్నట్లు సమాచారం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: