విక్రమ్ కు హిట్ దక్కాలంటే "అపరిచితుడు" సీక్వెల్ తోనే సాధ్యమా ?

VAMSI
తమిళ సినిమా పరిశ్రమకు చెందిన నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగులో విక్రమ్ కు మొదటి సినిమా దాసరి దర్శకత్వంలో హీరోకు ఫ్రెండ్ పాత్ర చేశాడు. ఆ తర్వాత తెలుగు మరియు తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి ఒక హీరోగా స్టాండ్ అవుతూ వస్తున్నాడు. కానీ అందరూ గుర్తించే పాత్ర కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. 2003 లో డైరెక్టర్ బాల విక్రమ్ కు జీవితంలో తనకు గుర్తుండిపోయే పాత్రను ఇచ్చాడు. ఇందులో తనతో పాటుగా సూర్య కూడా ఒక పాత్ర చేశాడు. మతిస్థిమితం లేని పాత్రలో విక్రమ్ అవార్డు విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు.
ఈ సినిమాతో విక్రమ్ అంటే ఏమిటో ఇండియాకు తెలిసింది. ఆ తరువాత సంచలనం దర్శకుడు శంకర్ తో అపరిచితుడు చేశాడు. ఈ సినిమా వరల్డ్ లెవెల్ లో మంచి పేరును తీసుకు వచ్చింది. సమాజాన్ని ప్రశ్నించే పాత్రలో విక్రమ్ రాము, రెమో మరియు అపరిచితుడు లాంటి మూడు పాత్రలను అవలీలగా చేసి ప్రేక్షకుల చేత భళా అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కు చెప్పుకోదగిన హిట్ అయితే ఇప్పటికీ రాలేదు. కానీ సినిమాలు చేయడం అయితే ఆపడం లేదు. 2005 నుండి ఇప్పటి వరకు పదికి పైగానే సినిమాలు చేశాడు.
కానీ సరైన హిట్ అందుకోలేకపోయాడు. కథలలో కూడా చాలా వ్యత్యాసాన్ని చూపించాడు అయినా విజయం దక్కలేదు. ఆఖరికి నిన్న ఎన్నో అంచనాలతో విడుదల అయిన కోబ్రా సైతం నిరాశనే మిగిల్చింది. ఇక విక్రమ్ కెరీర్ లో హిట్ పడాలంటే అపరిచితుడు కు సీక్వెల్ రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇప్పుడు శంకర్ ఉన్న బిజీ కి అపరిచితుడు సీక్వెల్ గురించి ఆలోచిస్తారా ? అసలు ఇది జరిగే పనేనా అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: