తాజాగా ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా .. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం లైగర్. ఇక పోతే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.అయితే అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ రెచ్చిపోయి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.ఇక ఇదిలా ఉండగా సుమారుగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో నష్టాలను మిగిల్చింది.అయితే అటు నిర్మాతలుగా పూరీ, ఛార్మీ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా పూర్తిగా నష్టపోయారని వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
పూరీ జగన్నాథ్ మళ్లీ రెండవసారి కూడా జనగణమన సినిమా ను కూడా విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇదంతా పక్కన పెడితే నటీనటుల పారితోషకాలే లైగర్ సినిమాకు మరింత భారంగా మిగిలాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను హీరో విజయ్ దేవరకొండ ఏకంగా రూ.35 కోట్ల పారితోషకం తీసుకున్నారు. కాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించినందుకు 3 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకోగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన ప్రముఖ సీనియర్ హీరోయిన్ అలాగే సీనియర్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ..
ఏకంగా హీరోయిన్లతో సమానంగా కోటి రూపాయల పారితోషకం అందుకున్నారు.ఇదిలావుంటే ఇక ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో మొదటిసారి కనిపించడం జరిగింది. ఇక సంవత్సరం పాటు చిత్ర బృందం ఈయన కోసం ఎదురుచూసిన తర్వాత ఆయన వెండితెరపై కనిపించడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇక సినిమా విడుదలైన తర్వాత.. ఇప్పటివరకు ఈయన ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే వార్త బయట వినిపించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్ సినిమా కోసం మైక్ టైసన్ ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం తీసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఇక ఆయన రేంజ్ ను బట్టి ఆ పారితోషకం ఇచ్చారు అని సమాచారం..!!