కొత్తిల్లు కొన్న విజయ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా టాప్ లో దూసుకుపోతున్నాడు విజయ్. వరుస సినిమాలతో హిట్లతో దూసుకుపోతున్న విజయ్ బీస్ట్ సినిమాతో ప్లాప్ ని అందుకున్నాడు. ఆ సినిమా వల్ల విజయ్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ కూడా ఫేస్ చేశాడు. అయితే తాజాగా ఆయన కొత్తిళ్లు కొన్నారు. చెన్నైలోని ఖరీదైన ఏరియాలో లగ్జరీ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేశాడు.దాని ధర తెలిస్తే ఇప్పుడు మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. మరి ఆ వివరాల్లోకి వెలితే. విజయ్‌ కోలీవుడ్‌ నాట తిరుగులేని స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. తమిళనాట అత్యంత ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విజయ్‌ ప్రస్తుతం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో గల ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు.ఇప్పుడు ఆయన అక్కడ నుంచి మారబోతున్నారట. ఆ రోడ్‌లో ట్రాఫిక్‌ బాగా పెరిగిపోవడంతో ఫ్రీగా ఉండే ఏరియాకి షిఫ్ట్ కావాలనుకున్నారట. అందులో భాగంగా చెన్నైలోని ఖరీదైన ఏరియాలో ఓ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేశాడు. దీని విలువ ఏకంగా రూ. 35కోట్లు అని తెలుస్తుంది.



రద్దీ నుంచి రిలీఫ్‌ పొందేందుకు, ప్రశాంతమైన ఏరియా కోసం ఆయన కొత్త ఇళ్లు కొన్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇదిలా ఉంటే అంతకు ముందున్న అడయార్‌లోని ఇంటిని ఆఫీస్‌గా చేసుకున్నారు విజయ్‌. అయితేఇప్పుడు కొన్న కొత్త బిల్డింగ్‌లోనే ఆఫీస్‌ని కూడా పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే అడయార్‌ ఇంటి నుంచి విజయ్‌ తన `విజయ్‌ మక్కల్‌ ఇయ్యకం` పార్టీ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందట. ప్రస్తుతం కొన్న అపార్ట్ మెంట్‌లో మరో కోలీవుడ్‌ హీరో కూడా ఉంటున్నారని సమాచారం తెలుస్తుంది.ఇక ప్రస్తుతం విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఒక సినిమా చేస్తున్నారు. ఆయన సూపర్ స్టార్ మహేష్ సూపర్ హిట్ మూవీ అయిన మహర్షి డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో వారిసుగా రూపొందుతుంది.టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రమిది. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: