బింబిసార 2: వావ్.. రామ్ చరణ్ కూడా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లేటెస్ట్ విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో వీరిద్దరి స్నేహం రీల్ లైఫ్‌లా అనిపించదు.నిజమైన స్నేహితుల్లాగే వుంటారు. నిజంగానే వీరిద్దరి మధ్యా అంత స్నేహం వుంది కాబట్టే ఆ ఎమోషన్‌ని అంత నేచురల్‌గా పండించి అద్భుతంగా నటించారు.ఆ స్నేహంతోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ కి సాయం చేయాలనుకుంటున్నాడట. ఆ సాయం ఏంటి అనుకుంటున్నారా.? 'అదే మాట' సాయం. అదేంటీ.? అనుకుంటున్నారా.? అసలు విషయానికి విషయానికి వస్తే..ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ జోరులోనే 'బింబిసార 2' సినిమాని కూడా స్టార్ట్ చేయాలనుకుంటన్నారట.ఈ సినిమా రిలీజ్‌కి ముందే 'బింబిసార 2' ప్రస్థావన వచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ మొత్తం కూడా ఎన్టీఆర్ పైనే నడుస్తుందనే హింట్ కూడా ఇచ్చేశారు.



ఇటీవలే రామ్ చరణ్‌, ఎన్టీఆర్ కలిసి 'బింబిసార' సినిమా చూశారట.రామ్ చరణ్‌కి ఈ సినిమా తెగ నచ్చేసిందట. సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ రామ్‌ని కలిశాడట రామ్ చరణ్. కళ్యాణ్ రామ్ వద్దకు ఎన్టీఆరే చరణ్‌ని తీసుకెళ్లాడట.చాలాసేపు ముగ్గురూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుకున్నారట. ఈ మీటింగ్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకొచ్చాయట. అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతానని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కి మాటిచ్చాడట.అంటే సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తానని రామ్ చరణ్, కళ్యాణ్ రామ్‌కి హామీ ఇచ్చాడనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, 'బింబిసార' ఇచ్చిన ఊపుతో, 'బింబిసార' పార్ట్ 2ని ఘనంగా తెరకెక్కించే ఏర్పాట్లలో వున్నారనీ సమాచారం తెలస్తోంది. మరి పార్ట్ 2 ఇంకెంత గొప్ప విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: