త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఎంతటి మైత్రి ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. జల్సా సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పటివరకు ఎంతో బాగా కొనసాగుతుంది. వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆయన రచయితగా కూడా చేయడం వారి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియపరుస్తుంది. ఆ విధంగా వీరిద్దరూ సినిమాలకు కలిసి పని చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అయితే అదే సమయంలో వీరిద్దరి స్నేహం వల్ల త్రివిక్రమ్ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను ప్రస్తుతం చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలను ఎప్పుడో పూర్తి చేయవలసి ఉంది కానీ దానిని ఆయన ఇంకా మొదలు పెట్టకపోవడం త్రివిక్రమ్ పై ఎఫెక్ట్ పడుతుంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను ఇప్పటికే పూర్తి చేయవలసి ఉంది. పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలవల్ల ఆ సినిమాను పూర్తి చేయలేకపోతున్నాడు. ఇటు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాను కూడా పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ రెండు చిత్రాలు ఇంకా మొదలు కాకపోవడమే వారి వారి అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తూ ఉంది.
దీనికి కారణం అని వారు ఆయనపై నిందలు వేస్తున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ అసలు లైనప్ లో లేని బీమ్ల నాయక్ సినిమాను ముందుకు తీసుకువచ్చి త్రివిక్రమ్ ఆ చిత్రాన్ని విడుదల చేయించాడు. దాన్ని అలా విడుదల చేయించడం పట్ల ఎంతోమంది ఆయన పై విమర్శలు కురిపించారు. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను కాకుండా వేరే చిత్రాలను ముందుకు తీసుకురావడం వెనక అర్థమేమిటి అనేది వారి ప్రశ్న. మరి ఇప్పటికైనా ఈ సినిమాలను చేయాలని సదరు దర్శకులు అభిమానులు కోరుతుండగా అవి ఇంకా ఆలస్యం అవ్వడం వారిలో ఇంకా కోపాన్ని రెట్టింపు చేస్తుంది.