ట్రైలర్ : రిపీట్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీనే నమ్ముకున్న హీరో..!!

Divya
యువ హీరో నవీన్ చంద్ర ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు అని చెప్పవచ్చు. గత ఏడాది నుంచి ఈ హీరో వేగం మళ్ళీ పుంజుకుంది వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ హీరోగా మారిపోయారు గత సంవత్సరం పరంపర అనే వెబ్ సిరీస్తో డిస్నీ హాట్ స్టార్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక పాపులర్ తో గత సంవత్సరం గని, విరాటపర్వం వంటి చిత్రాలలో నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయాయి కానీ తాజాగా రిపీట్ అంటూ మిస్టారికల్ క్రైమ్ త్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిస్తున్న రిపీట్ ట్రైలర్ విడుదల కావడం జరిగింది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది.

ఇక ట్రైలర్ లోకి వెళితే.. గేమ్ మొదలుపెట్టిన ఫస్ట్ లోనే ఒకరు తనకి చెక్ పెడితే ఎలా ఉంటుందో అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఒక క్రిమినల్ కు, ఒక ఐపీఎస్ కు మధ్య జరిగి కొన్ని సంఘటనలు ఈ సినిమా ట్రైలర్ ని బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి. నవీన్ చెప్పిన ప్రతి డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు హత్యలు మరొకవైపు పోలీస్  ఇన్వెస్టిగేషన్ ఇలా రెండు ఒకేసారి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలోని సన్నివేశాలు అత్యంత థ్రిల్లర్గా మలిచినట్లుగా కనిపిస్తున్నది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఎవరు గెలుస్తారో అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 25 వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయబోతున్నారు ఈ చిత్రంలో స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్నది.. ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్రలో మధు నటిస్తున్నారు.ఇక వీరితో పాటే.. మీమీ గోపి, నవీన రెడ్డి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: