చైతు తో రష్మిక.. ఏ సినిమా అంటే?

P.Nishanth Kumar
రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప రెండవ భాగం చిత్రం త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆమె మళ్లీ తెలుగులో వరుస సినిమాలు ఒప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. బాలీవుడ్ కోలీవుడ్ లలో పలు చిత్రాలలో హీరోయిన్ గా చేస్తున్న ఈమెకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదని చెప్పాలి. ఈ క్రమంలో ఆమెకు తాజాగా ఓ సినిమా అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు చిత్ర బంధం రంగం సిద్ధం చేస్తుంది.
ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య ఆ తర్వాత విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తమిళనాడులో వెరైటీ సినిమాలు చేయడానికి పునాదులు వేసిన విక్రమ్ ప్రభు తొలిసారి తెలుగులో ఓ సినిమా చేస్తున్నడం విశేషం. ఆ విధంగా మానాడు సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ దర్శకుడు ఆ వెంటనే తెలుగులో నాగచైతన్యతో సినిమా చేయడం విశేషం. కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలయ్యి శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇకపోతే నాగచైతన్య పరశురామ్ దర్శకత్వం లో కూడా చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఆయన ఓ కథను వినిపించగా దానికి ఫుల్ ఫిదా అయిపోయిన నాగచైతన్య త్వరలోనే ఆ చిత్రాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన నటీనటులను ఎంపిక చేసే క్రమంలో హీరోయిన్ గా రష్మిక మందనను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండడం విశేషం. మరి చాలా రోజుల తర్వాత మరొక తెలుగు సినిమాలో కనిపించబోతున్న రష్మిక మందన ఈ చిత్రం తర్వాత కూడా మరిన్ని సినిమాలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: