ఏందీ సామీ ఇది.. ఇంత బూతు పంచులా?

praveen
ఈ మధ్యకాలంలో జనాలు బూతు కి బాగా అలవాటు పడిపోయారా అంటే అవును అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సినిమాల్లో లిప్లాక్ సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులు హర్ట్ అవుతున్నారు. ఇక ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి అంటే చాలు తెగ సంబరపడిపోతున్నారు. ఇక బుల్లితెరపై కామెడీ షో లో కూడా ఇలాంటి బూతు పురాణం కొనసాగుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రేక్షకులను నవ్వించాలి అంటే బూతు ఒక్కటే మార్గం అనుకుంటున్నారో ఏమో కమెడియన్స్ అందరూ కూడా డబుల్ మీనింగ్ పంచులతో రెచ్చిపోతున్నారు.

 ఇక వల్గర్ పదాలు వాడితేనే పంచులు బాగా హిట్ అవుతూ ఉండడంతో కమెడియన్స్ కూడా చేసేదేమీ లేక ప్రేక్షకులకు నచ్చింది చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. బుల్లితెరపై  ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇందులో కమెడియన్స్ వేసే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఈ పంచ్ డైలాగులతో కొన్నిసార్లు జడ్జ్ లు సైతం తలదించుకుంటారు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి జబర్దస్త్ లో ప్రక్షాళన కొనసాగుతూ ఉంటే ఎంతో మంది బయటికి వెళ్ళిపోతున్నారు. కొత్త వారు షో లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

 ఈ క్రమంలోనే మరోసారి షో కి మంచి రేటింగ్ తెచ్చే క్రమంలో మళ్ళీ డబుల్ మీనింగ్ డైలాగులకే పనిచెప్పారు కమెడియన్స్. ఇకపోతే ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో  భాగంగా తాగుబోతు రమేష్ స్కిట్ లో కామెడీ టైమింగ్ కొంచెం హద్దులు దాటేసినట్లు కనిపించింది. స్కిట్ లో భాగంగా రమేష్ తన భార్యతో హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటాడు.  హనీమూన్ లో ఏం చేస్తారు అని అడుగగా.. మూన్ ని చూస్తూ హనీ నాకాలి అని సమాధానం చెప్పాడు తాగుబోతు రమేష్. అప్పుడు లేడీ కమెడియన్ స్పందిస్తూ  నాకడానికి అంత దూరం వెళ్ళాలా అంటూ కాస్త వల్గర్ పదాలను వాడింది. వీరు చెప్పిన పంచ్ కి అసలు అర్థం అందరికీ తెలిసిన జబర్దస్త్  లో ఇలాంటివి మామూలే అంటూ కొంతమంది లైట్ తీసుకుంటే.. మరికొంతమంది మాత్రం ఇలాంటి పంచులు పై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: