ఏ వయసులో చేయాల్సింది.. ఆ వయసులో చేయాలి.. ప్రగతికి కౌంటర్?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై సీరియల్స్ ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించాయో ఊహించని రీతిలో అటు కామెడీ షో జబర్దస్త్ కూడా అదేరీతిలో క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జబర్దస్త్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీల ముందు కూర్చుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇక సినిమాల్లో అందని కామెడీ జబర్దస్త్ ద్వారా ఎంజాయ్ చేస్తూ పగలబడి నవ్వుకుంటారు. ఒత్తిడితో కూడిన నేటితరం జీవితంలో జబర్దస్త్ చూస్తూ హాయిగా నవ్వుకుంటూ కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించిన జబర్దస్త్ ఎప్పటికప్పుడు సరికొత్త కామెడీతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం జబర్దస్త్ లో ఊహించని రీతిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ లో కొనసాగుతూ భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఇటీవలే షో నుంచి బయటికి వస్తూ ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. సుడిగాలి సుదీర్ ఇప్పటికే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. యాంకర్ అనసూయ కూడా తప్పుకోవడంతో  ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ జబర్దస్త్ లో కూడా ప్రమోషన్ వచ్చేసింది.

 ఇకపోతే ఇటీవల జడ్జ్ లలో కూడా ఎంతో మంది మారుతూ ఉన్నారు  అని చెప్పాలి. ఇప్పటికే జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ పిక్స్ అవగా మొన్నటి వరకు మనో జడ్జిగా కొనసాగారు. కాని ఆయన ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి జడ్జి సీట్లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ ఇండైరెక్టుగా ప్రగతి  కి కౌంటర్ వేసాడు. ప్రగతి ఎక్కువగా  వర్క్ ఔట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే స్కిట్ లో భాగంగా వర్కౌట్ చేస్తూనే డైలాగులు చెబుతూ ఉంటాడు రాఘవ. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అంటూ పక్కనే ఉన్న మరో కమెడియన్ చెబుతాడు. ఏంటి ప్రగతి గారి ని అంత మాట అంటావా అంటూ రాకెట్ రాఘవ షాక్ అవ్వగా.. ప్రగతి గారిని కాదు నిన్ను అన్నాను అంటూ చెప్పడంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: