నా సెక్స్ లైఫ్ లో అవి లేవు.. అందుకే కరణ్ షోకి పిలువలేదు అంటున్న తాప్సీ?
ఇక ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల శభాష్ మిథు అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కాగా ఆగస్టు 19 వ తేదీన దోబారా అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్మైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది తాప్సీ. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మల్టీ టాలెంటెడ్ కరణ్ జోహార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ షో కి మీరు వెళ్లలేదా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ చెప్పింది తాప్సీ. నా సెక్స్ లైఫ్ లో కొత్తగా ఏంలేదుగా.. అందుకే ఆ షో నుంచి నాకు ఆహ్వానం రాలేదు.. సెక్స్ పరంగా ఆసక్తికర అంశాలు నా దగ్గర లేవు అంటూ కాఫీ విత్ కరణ్ షో పరోక్షంగా తనకు నచ్చదు అని చెప్పింది తాప్సీ. ఇటీవల కాలంలో కాఫీ విత్ కరణ్ షో ఇంటర్వ్యూలో చూస్తే ఎక్కువగా సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నారు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ నిన్నటికి నిన్న అమీర్ ఖాన్ కరీనా కపూర్ ని కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారూ అన్న విషయం తెలిసిందే.