రమ్యకృష్ణను వేధించిన ఆ డైరెక్టర్.. నరకం అనుభవిస్తూ చనిపోయాడట?

praveen
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో రోజుల నుంచి పాతుకు పోయింది అన్న విషయం తెలిసిందే. అవకాశాలు రావాలంటే పక్క లోకి వెళ్లాల్సిందే అన్నది ఎవరో చెప్పడం కాదు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటివరకు బయటపెట్టి సంచలనం సృష్టించారు. అంతేకాదు కెరియర్ మొదట్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ వారు ఉన్నారు. ఇక ఇలాంటి వారు ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలలో తమ చేదు అనుభవాలను చెబుతూ ఉండటం సంచలనంగా  మారిపోతుంది.

 ఇక అందరి హీరోయిన్ల లాగానే సౌత్ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్గా హవా నడిచిన రమ్యకృష్ణకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్ప లేదట.  ఒక దర్శకుడి కారణంగా రమ్యకృష్ణ ఎంతగానో ఇబ్బందులు పడిందట. తర్వాత కాలంలో మాత్రం రమ్యకృష్ణ ను  ఇబ్బందులకు గురి చేసిన దర్శకుడు ఎన్నో బాధలు పడుతూ నరకం అనుభవిస్తూ చనిపోయాడట. ఒకప్పుడు గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది రమ్యకృష్ణ. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి యువతను పిచ్చెక్కించింది అని చెప్పాలి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తుంది.

 రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అవకాశాల పేరుతో ఎంతో మంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారట. ఇక ఓ స్టార్ డైరెక్టర్ అయితే బూతు వీడియోలు చూపించి మరి తెగ ఇబ్బందులకు గురి చేశాడట. అయితే వయసులో పెద్దాయన ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడంతో రమ్యకృష్ణ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదట. అయితే ఇలా రమ్యకృష్ణ ను ఇబ్బందులకు గురి చేసిన ఆ స్టార్ డైరెక్టర్ మాత్రం చివరి రోజుల్లో నా అన్నవాళ్లు లేకుండా కనీసం తిండి పెట్టే  దిక్కు కూడా లేక నరకం అనుభవిస్తూ చనిపోయాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: