మీడియా పై హీరో సిద్ధార్థ్ అసహనం !

Seetha Sailaja

‘బొమ్మరిల్లు’ మూవీ తరువాత సిద్ధార్థ్ కు చెప్పుకోతగ్గ హిట్ లేదు. తమిళ సినిమాలు చేస్తూ ఆసినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతతరం ప్రేక్షకులు సిద్ధార్థ్ ను పట్టించుకోవడం లేదు. దీనితో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఏదోఒక వివాదాస్పద వ్యవహారంలో తలదూరుస్తూ జనం తనను మర్చిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.


ఆమధ్య టెన్నిస్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాకు సంచలనంగా మారారు. అయితే ఆవ్యాఖ్యల పై విపరీతమైన దుమారం రేగడంతో సిద్ధార్థ్ క్షమార్పణలు చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. గతంలో సమంతతో ప్రేమ వ్యవహారం నడిపించి ఆమెతో బ్రేకప్ చెప్పిన తరువాత సిద్ధార్థ్ పేరు గాసిప్పులలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు.


అయితే మళ్ళీ సిద్ధార్థ్ పేరు గాసిప్పులలో బాగా కనిపిస్తోంది. దీనికికారణం సిద్ధార్థ్ ఈమధ్య హీరోయిన్ అదితీరావ్ హైదరీ తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ముంబాయిలో రకరకాల పబ్ లకు హోటల్స్ వెళుతూ సందడి చేస్తున్న విషయాన్ని బాలీవుడ్ మీడియా పసిగట్టింది. ఈమధ్య వీరిద్దరూ ఏకాంతంగా ఒక హోటల్ లో ఉన్నప్పుడు మీడియా కంట పడటంతో వీరిద్దరినీ ఫోటోలు తీయడానికి బాలీవుడ్ మీడియా ప్రయత్నించిందట.


ఈఅనుకోని పరిణామానికి షాక్ అయిన సిద్ధార్థ్ బాలీవుడ్ మీడియా వర్గాల పై విరుచుకు పడ్డాడని తెలుస్తోంది. దీనితో మరింత రెచ్చిపోతు బాలీవుడ్ మీడియా వీరిద్దరి పై అనేక గాసిప్పులను కథనాలుగా వ్రాస్తోంది. రాచరిక కుటుంబానికి చెందిన అదితీరావ్ ఇప్పటికే డైవర్సీ. కనీసం ఇప్పటికైనా ఆమె జీవితం సిద్ధార్థ్ తో స్టిరపడుతుందో లేదో చూడాలి. ప్రస్తుత రాజకీయాల పై కూడ సిద్ధార్థ్ నిరంతరం విమర్శలు చేస్తూ ఉంటాడు. ఈమధ్య ప్రతి ప్రముఖ వ్యక్తి నోటి వెంట బయటకు వస్తున్న పాన్ ఇండియా మూవీ అన్నపదం పై సిద్ధార్థ్ స్పందిస్తూ ఇండియన్ సినిమా అనాలి కాని  పాన్ ఇండియా సినిమా అన్న పదం ఏమిటి అంటూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: