Rc15 ఫస్ట్ లుక్ విడుదలకు గ్రాండ్ ఈవెంట్..ఏంటి శంకర్?

Satvika
రామ్ చరణ్ ఇప్పుడు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తున్నారు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది..ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సినిమాలో ప్రతి అంశం అత్యంత గ్రాండియర్‌గా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు దర్శకుడు శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబతున్నాయి. ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి, లాంఛ్ చేయాలని శంకర్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో చరణ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని, అందుకే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌తో ఈ సినిమాపై మరింత హైప్ తీసుకురావాలని శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తుంది.


ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను వచ్చే మార్చిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఆగస్టు 15న నిజంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా.. నిజంగానే ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గ్రాండ్ ఈవెంట్‌ను శంకర్ ప్లాన్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: