కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించేవాడు నేనురల్ స్టార్ నాని. అయితే ఇక ఇప్పుడు ఆ అవకాశం అనేది లేకుండా పోయింది.అంటే సుందరానికి సినిమా తర్వాత ఈ స్పీడ్ బాగా తగ్గింది.భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా రివ్యూస్ పరంగా మౌత్ టాక్ పరంగా హిట్ అయినప్పటికీ కమర్షియల్ గా వర్క్ ఔట్ కాక నిర్మాతలకు 10 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని సరసన మలయాళం హీరోయిన్ నజ్రియా నజీమ్ నటించింది. నిజానికి నాని కంటే ఈమె ఎక్కువగా ఈ సినిమాపై అసలు పెట్టుకుంది. నాని లాంటి హీరో మైత్రి లాంటి నిర్మాణ సంస్థ కావడంతో టాలీవుడ్ కి మంచి హిట్ ద్వారా ఎంట్రీ ఇద్దామనుకున్న ఈ మలయాళం బ్యూటీకి ఈ సినిమాతో నిరాశ మిగిలింది. ఇక ఈ సినిమా ఇచ్చిన షాక్ తో నజ్రియా ఇక ఇప్పట్లో ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదని సమాచారం తెలుస్తుంది.
ఇక నానికి ఇప్పుడు చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ఏంటయ్యా అంటే దసరా అని చెప్పాలి.ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక 2017లో విడుదలైన మిడిల్ క్లాస్ అబ్బాయి(MCA) తర్వాత నానికి ఆ స్థాయి విజయం లభించలేదు. మధ్యలో వచ్చిన 'జెర్సి' సినిమా నానికి పేరు తెచ్చి పెట్టింది కాని, మిడిల్ క్లాస్ అబ్బాయి రేంజ్ లో అయితే అది విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగ రాయ్ ఇంకా అంటే సుందరానికి చిత్రాల పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నాని. అయితే వీటిల్లో శ్యామ్ సింగ రాయ్ సినిమా కొంత ఇంప్రెస్ చేసినప్పటికీ, అంటే సుందరానికి సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఓ విధంగా ఇది నానికి షాక్ ఇచ్చింది.అందుకే చేతినలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని నాని చాలా బలంగా కోరుకుంటున్నాడు.