ఈ ముగ్గురు హీరోలతో సినిమా సక్సెస్ అయ్యేనా..?

Divya
కే జి ఎఫ్ చిత్రాలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న బ్యానర్ హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యానర్లో సినిమా అంటే దర్శక, హీరోలు చాలా మక్కువ చూపుతున్నారు. ఇక టాలీవుడ్ బాలీవుడ్ ,కోలీవుడ్ లో కూడా ఇలా అనేక భాషలలో సినిమా చేయడానికి ఈ నిర్మాణ సంస్థ కూడా ముందుకు వెళ్తోంది. ఈ నిర్మాణ సంస్థ వందల కోట్ల రూపాయలతో సినిమా అన్ని నిర్మించడమే కాకుండా పలు లాభాలు కూడా పొందుతోంది.

సినిమాలో నిర్మాణానికి రాజీపడకుండా భారీ పారితోషాలను ఇస్తూ ఉన్నది ఈ నిర్మాణ సంస్థ. ఈ నిర్మాణ సంస్థని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తీసుకువచ్చిన ఈ బ్రాండ్ తన హవాని అలాగే కొనసాగించాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక ఈ బ్యానర్ పైన రాబోయే చిత్రాలు బ్యానర్ ముందుగానే లాక్ చేయడం జరిగింది మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారంతో కలిసి సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.

ఇక అంతే కాకుండా గురు, ఆకాశమే నీ హద్దురా వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ సుధా తో కూడా ఒక సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో సూర్య దుల్కర్ సల్మాన్ ,నాని హీరోలుగా నటిస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు కూడా భారీగానే బడ్జెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఒకేసారి అన్ని భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ ని బాగా పాపులర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: