చరణ్ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరో..ఎవరంటే?

Satvika
మెగా హీరో రామ్ చరణ్ నటించనున్న తాజా చిత్రం షూటింగ్ పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా లో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై యావత్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియా లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది..

ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరో కీలక పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన మాధవన్, ఈ సినిమా లోని ఓ కీలక పాత్ర లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో మాధవన్ లుక్స్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపిస్తాడని, ఆయన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటీవల రాకెట్రీ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్, ఇప్పుడు చరణ్ కోసం వస్తుండటం తో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు..

ఇక పొలిటికల్ సబ్జెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమా లో చరణ్ పాత్ర ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమా లో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా లో మాధవన్ నిజంగానే నటిస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఈ వార్త నిజమైతే మాత్రం ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది.. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తీ చేసుకొని విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: