అప్పు తీర్చిన మహేష్.. ఏ బ్యాంక్ కంటే..?
అంతేకాదు ఆ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా గుర్తుకొస్తాయి . ముఖ్యంగా కోట్లాది రూపాయల ధారావి ప్రజల అప్పును తానే తీర్చేస్తారని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ ఊరి ప్రజలతో శపథం చేస్తాడు . ఇక అతడు చెప్పే డైలాగు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా పూరి ఆ డైలాగును అంతే పవర్ ఫుల్ గా రాసి ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకు పోయాలా చేశాడు. ముంబైని ఏల్తానని వచ్చిన ఒక నిరుద్యోగి ఏకంగా ప్రజలందరి బ్యాంకు అప్పు తీర్చేస్తానని ప్రగల్భాలు పలికితే సాధారణ ఉద్యోగైన బ్రహ్మాజీ కూడా నివ్వెరపోతాడు ఆ సన్నివేశంలో.. ఇక ఆ తర్వాత సినిమా స్క్రీన్ ప్లే గురించి మనకు తెలిసింది అయితే ఇప్పుడు బిజినెస్ మాన్ లో ఒక సన్నివేశంలో చూసిన అదే ధారావి బ్యాంకు కథతో ఏకంగా ఒక సీరీస్ ని రూపొందించడం జరిగింది.
ఇక ప్రస్తుతం సునీల్ శెట్టి ఓటిటి అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధారావి బ్యాంక్ అనేది సిరీస్ టైటిల్ గా నిర్ణయించారు. ఇక ఇందులో సునీల్ శెట్టితో పాటు సోనాలి కులకర్రని వివేక్ ఓబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సిరీస్ కి సంబంధించిన విషయాలు కూడా తాజాగా విడుదలయ్యాయి. ధారావి బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకమైన క్రైమ్ డ్రామా సీరీస్ గా ఎక్కబోతున్నట్లు.. చివరి వరకు ఉత్కంఠ గా సాగుతుందని సమాచారం. ఇక మొత్తానికైతే మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమాలో ధారావి బ్యాంకు అప్పు తీర్చినట్లుగా ఇక ఈ సీరీస్ లో సునీల్ శెట్టి ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.