షాకింగ్ కీరవాణి సంస్కారం ఇదేనా అంటూ కామెంట్స్ ?
కీరవాణిని చాలామంది సంస్కారిగా పేర్కొంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో కొన్ని ద్వందార్థాలు వచ్చే విధంగా చేసిన పోష్టింగ్ పై చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. ఇలా కీరవాణి ప్రవర్తించడం వెనుక ఒక ఆశక్తికర కారణం ఉంది. ఆస్కార్ బహుమతి గ్రహీత రసూల్ పూకుట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలకు కీరవాణికి విపరీతమైన కోపం వచ్చింది.
తనకు ఇంగ్లీష్ భాషలో పెద్ద అక్షరాలూ చిన్న అక్షరాలూ ఎలా వాడాలో తెలియదు అంటూ రసూల్ పూకుట్టి పేరును విరిచి వ్రాస్తూ అందులో ద్వంర్థాలు వచ్చే విధంగా కీరవాణి ఆంగ్ల భాషలో చేసిన కామెంట్స్ చదివిన నెటిజన్ లు కీరవాణి ఇలాంటి భాషను వాడగాలడా అంటూ కొందరు ఆశ్చర్య పడుతున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ పై రసూల్ కుట్టి చేసిన విమర్శలకు ఘాటైన సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఇలా ద్వంర్థాల ప్రయోగం కీరవాణి స్థాయికి తగునా అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా చేయకపోయినా ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో రాజమౌళి తప్పటడుగు వేసాడు అన్నది విమర్శకుల మాట. అయితే రాజమౌళి పై ఉన్న అభిమానం గౌరవం వల్ల ఆవిషయాన్ని విమర్శకులు కానీ అదేవిధంగా ప్రేక్షలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కోట్ల స్థాయిలో కలక్షన్స్ రాబట్టగలిగింది అన్నది వాస్తవం. పైకి చెప్పకపోయినా ‘ఆర్ ఆర్ ఆర్’ రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు..