మళ్ళీ దొరికిపోయిన బండ్ల గణేష్.. మిస్ ఫైర్ అయిన ట్వీట్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..?

Anilkumar
అప్పట్లో అందరూ ఒక  సామెత చెబుతూ ఉంటారు.అది ఏంటంటే 'చూసి రారా అంటే కాల్చి వచ్చినట్టు' అని..!ఇక  ఇది టాలీవుడ్ కమెడియన్, నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది.అయితే మనోడు ఏం వాగినా.. ఏం ట్వీటినా సెన్సేషనే..! ఇక ఈయన ఏదైనా వేడుకకు వెళ్లి మైక్ పట్టుకున్నాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేళ్తాడో తెలీదు. అయితే ఇటీవల జరిగిన 'చోర్ బజార్' ప్రీ రిలీజ్ వేడుక అందుకు ఉదాహరణ.ఇకపోతే పూరీ జగన్నాథ్‌ ఆ వేడుకకు రాకపోతే.. అది కవర్ చేయడం మానేసి.. ఇక అతని పర్సనల్ వ్యవహారాన్ని కెలికాడు.

అయితే  పూరి ఈ విషయం పై పరోక్షంగా కౌంటర్ కూడా వేసి అంతకు మించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇదిలావుంటే ఏదేమైనా గుట్టుగా ఉన్న పూరి వ్యవహారాన్ని అల్లరల్లరి చేసి పారేశాడు బండ్ల గణేష్.పోతే  మాట్లాడేప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడొచ్చు.అయితే  కానీ ట్వీట్ చేసేటప్పుడు అయినా కరెక్ట్ గా చేయాలి కదా.ఇకపోతే అది చేయడు…ట్వీట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా సార్లు ట్రోలింగ్ కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక ఇదిలావుంటే తాజాగా  నిన్న దిల్ రాజు కి అబ్బాయి పుట్టాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఇక అందుకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసి తన ఆనందాన్ని తెలిపాడు దిల్ రాజు.అయితే ఇక ఈ సందర్భంగా దిల్ రాజు కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ వేశాడు బండ్ల గణేష్.ఇకపోతే ఇందులో తప్పేమీ లేదు కాకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ ట్విట్టర్ ట్యాగ్ '@SVCCofficial' కు బదులు '@SVCC'(శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర) ఇక అఫీషియల్ ట్విట్టర్ ట్యాగ్ ను జత చేశాడు.అయితే  అది మన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి నిర్మాణ సంస్థ కు సంబంధించిన ట్యాగ్. ఇక...అంతే బండ్ల గణేష్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.  ఇలా ఎలా టాగ్ చేస్తాడు అది ఇది అని నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: