రాశీ ఖన్నా కు ఆ హీరో అంటే చాలా ఇష్టమట..!!
ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో తన కెరియర్ మరియు తన డ్రీమ్ రోల్స్ ను కూడా తెలియజేసింది. ఇక అలాంటి సమయంలోనే మహేష్ బాబు పై తనకున్న ఇంట్రెస్ట్ ను కూడా తెలియజేసింది. టాలీవుడ్ హీరోల ఏ హీరో తో మీరు సినిమా చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురవగానే.. తను ఆలోచించకుండా మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి ఒక సినిమా అయినా చేయాలని ఉంది సమాధానం తెలియజేసింది. అందుకోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని కూడా తెలిపింది.
మహేష్ బాబుతో రాశీ ఖన్నా నే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ సైతం సినిమాలు చేయడానికి చాలా ఆశపడుతున్నారు గతంలో పలు సందర్భాల్లో పలువురు హీరోయిన్ల తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా వారి లిస్టులో రాశీ ఖన్నా కూడ చేరిపోయింది. పక్కా కమర్షియల్ చిత్రం తో టాలీవుడ్ లో మరింత స్థానం దక్కించుకుంటుందేమో చూడాలి రాశీ ఖన్నా. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కించారు. నిర్మాతగా బన్నీ వాసు అల్లు అరవింద్ నిర్మించడం జరిగింది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగా ఈ చిత్రం ఖచ్చితంగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం తెలియజేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.