'విరాట పర్వం' సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. భారీ అంచనాల నడుమ జూన్ 17 న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే మొదట్లో అన్నీ పాజిటివ్ గా ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు మాత్రం వరుస వివాదాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే సాయి పల్లవి సినిమా ప్రమోషన్లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్, గో హత్యలు గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక ఇప్పటికీ సాయిపల్లవి వివాదం ఇంకా నడుస్తూనే ఉండగా.. తాజాగా ఈ సినిమాకి మరో వివాదం తలెత్తింది. విరాట పర్వం సినిమా నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కింది.

నిజానికి అధికారికంగా నక్సలిజాన్ని భారతదేశంలో బ్యాన్ చేశారు. కానీ ఈ సినిమాలో నక్సలిజాన్ని మంచిగా చూపించి పోలీసులను చెడుగా చూపించారు. దీంతో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విశ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి అజయ్ రాజ్ సుల్తాన్ బజార్ పోలీస్ లకు శనివారం సాయంత్రం విరాటపర్వం సినిమా పై ఫిర్యాదు చేశారు. ఇక తన ఫిర్యాదులో పేర్కొంటూ.." విరాటపర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. పోలీస్ లను సైతం కించపరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

ఇందులో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు నిషేధిత సంస్థల నక్సలిజం, ఉగ్రవాదం ఏ ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చింది అని ప్రశ్నిస్తూ ఈ సినిమాకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మరోసారి విరాటపర్వం చిత్ర యూనిట్ కి భారీ షాక్ తగిలినట్టైంది. మరి ఇప్పటి వరకూ ఈ వివాదంపై చిత్ర యూనిట్ అయితే స్పందించలేదు. చూస్తుంటే రోజురోజుకు ఈ సినిమాపై మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ ఫిర్యాదుపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: