వామ్మో : ఏకంగా 8 కార్లను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. ఖరీదు తెలిస్తే షాక్..!!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈయన త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇక ఇందులో భాగంగానే తన పర్యటన కోసం కొత్త కాన్వాయ్ ను కూడా  పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్నారు. ఇక పర్యటన కోసం  ఏకంగా 8 కొత్త కార్లు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. ఇక పోతే ఈ కొత్త కార్ల కోసం ఏకంగా ఆయన కోటి యాభై లక్షల రూపాయలను ఖర్చు చేశారు అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఒక్కో కారు విలువ 19 లక్షల రూపాయలు అటు ఇటు ఉంటుందని తెలుస్తోంది  జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కార్లను కొనుగోలు చేశారు అని ప్రచురితమవుతున్నాయి.
ఇకపోతే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్లనున్నారు. ఇటు సినిమాలు.. రాజకీయాలలో రెండింటిలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇకపోతే సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల పై ఫోకస్ చేసి జనం లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 35 లక్షల రూపాయలను కానుకగా ప్రకటించారు మెగా ఫ్యామిలీ. ఇకపోతే ప్రజల్లోకి పర్యటించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కాబట్టి సరికొత్తగా కాన్వాయ్ ను సిద్ధం చేసుకున్నారు అని సమాచారం..
ఏపీ పర్యటన కోసం పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న కొత్త కాన్వాయ్ తో పాటు మరో ఎనిమిది స్కార్పియో లకి కూడా అర్చకులు ఇవాళ పూజ కూడా నిర్వహించారు. నేరుగా ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకొని రాజకీయ పదవి చేపట్టిన తర్వాత సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ . ఇకపోతే నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందజేస్తారు అని సమాచారం. ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: