2022లో తెలుగు రాష్టాల్లో క్లీన్ హిట్ గా నిలిచినవి 7 సినిమాలే... అవి ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
2022 వ సంవత్సరం ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించి మంచి విజయాలను సాధించగా, కొన్ని సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు వచ్చినప్పటికీ ఆ సినిమాలకు జరిగిన ప్రీ రిలీజ్ కారణంగా ఆ మూవీ లో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయాయి. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2022 వ సంవత్సరంలో కేవలం 7 సినిమాలు మాత్రమే జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచాయి. ఆ 7 సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.


బంగార్రాజు : టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నాగ చైతన్య కీలకపాత్రలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.


డీజే : సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించి క్లీన్ హిట్ ను అందుకుంది.


ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ  షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ ను సాధించింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.


కాలేజ్ డాన్ : శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.


మేజర్ : అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా అతి తక్కువ రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.


విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: