ఆ స్టార్ హీరో చేసిన సినిమా తను చేసి ఉంటే బాగుండేది అంటున్న హీరో..!!

Divya
గత సంవత్సరం శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో నాని. ఇప్పుడు తాజాగా అంటే సుందరానికి వంటి చిత్రం తో ప్రేక్షకులను త్వరలోనే అలరించబోతున్నాడు. ఇందులో మలయాళం హీరోయిన్ నజ్రియా నటిస్తున్నది. మొదటి సారిగా టాలీవుడ్ తెరపై నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు గా ఉన్నారు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించబడిందని చిత్ర బృందం తెలియజేసింది.

ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ,టీజర్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూన్ 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ మలయాళం వంటి భాషలలో విడుదల కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా చేస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో నాని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు.
ఈ మధ్య ఏదైనా పాత్ర చూసినప్పుడు ఇలాంటి సినిమాలను చేసి ఉంటే బాగుండేదనిపించింది అనే ప్రశ్న ఎదురవగా.. హీరో నాని మాట్లాడుతూ సూర్య నటించిన జై భీమ్ చిత్రం చూసినప్పుడు ఇలాంటి సినిమా తన కెరీర్ లో ఉంటే బాగుంటుంది అనిపించింది తన మనసులో మాట తెలియజేశారు. అలాగే తెలుగులో ఇలాంటి కథలు రావాలి అని తెలియజేశారు. అయితే ఇలాంటి సినిమాలలో హీరో గా ఎవరు నటించిన ఓకే అని తెలియజేశాడు. ఇక అంటే సుందరానికి చిత్రంలో నజ్రియా ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తుందని తెలియజేశారు. ఇక నాని ఇంట్లో కూడా ఎవరు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనే ప్రశ్న ఎదురుగా.. అందుకు నాని నవ్వుతూ తను తీసే ఫోటోలు బాగుంటాయని.. కానీ తన ఫోటోలను ఎవరూ కూడా సరిగ్గా తీయారని నవ్వుతూ తెలిపాడు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: