ప్రముఖ టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం.. కారణం..?

Divya
ఇటీవల కాలంలో చాలామంది చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యాయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తే మరికొంత మంది లైంగిక వేధింపులు తట్టుకోలేక మరణిస్తున్నారు. తాజాగా మరొక ప్రముఖ టీవీ సీరియల్ నటి కట్టా మైథిలి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో ఉన్న ఈమె ఆత్మహత్యాయత్నం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కట్టా మైధిలికి తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాలపై  చేసిన ఫిర్యాదు పై  ఇప్పటి వరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆమె మనస్తాపానికి లోనై వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.ఆర్.నగర్ పోలీసుల సహాయంతో ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని వెంటనే ఆమెను కాపాడారు. ఇక అనంతరం దగ్గర్లో ఉన్న నిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది . ఇక ఎస్.ఆర్.నగర్ పరిధిలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మోతే పిఎస్ లో గతంలో మైతిలి తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది సెప్టెంబర్ 2021లో తన భర్తపై మళ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో ఆమె భర్త శ్రీధర్ , నలుగురు నిందితులుగా ఉన్నారు. కానీ కేసు విచారణ పూర్తయినప్పటికీ తనకు న్యాయం కలగలేదు అని ఆమె పోలీసులను కోరింది. పిలుపు రాలేదని ఇకపోతే క్రైమ్ నెంబర్ 56/2021 ఐపీసీ సెక్షన్ 498 ఏ డొమెస్టిక్ వైలెన్స్ డి పి 3,4  సెక్షన్ల కింద ఆమె భర్త పై కేసు నమోదు చేశారు .

ఇకపోతే గతంలో మైథిలి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ ఉండేవారు . ఇక అక్కడ ఉన్న సమయంలో తన బంగారు ఆభరణాలు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. అక్కడ పంజాగుట్ట పోలీసులు తనకు సరైన సమాధానం ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఆమె ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సారథి స్టూడియో వెనకాల ఉన్న తన అపార్ట్ మెంట్ కు చేరుకొని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఇకపోతే ప్రస్తుతం మైథిలి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని వైద్యులు నిర్దారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: