హాలీవుడ్ చాలా తేలిగ్గా తీసి వేసిన హీరోయిన్.. కారణం..!!

Divya
బాలీవుడ్ లో స్టార్స్ కూడ ఈ మధ్యకాలంలో హాలీవుడ్ నుంచి కూడా పిలుపులో వినిపిస్తున్నాయి. చాలా మంది బాలీవుడ్ స్టార్లు సైతం హాలీవుడ్లో కూడా చిన్నచిన్న సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలలో, వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా గ్లోబుల్ స్టార్ అనే పేరును కూడా దక్కించుకున్నది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు దీపికా పడుకొనే కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
కానీ దీపిక పడుకొనే మాత్రం హాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదని ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లలో నెంబర్ గా వ్యవహరించడం దృష్టిని ఆకర్షించింది. ముందుగా హాలీవుడ్ ఫిలిం మేకర్స్ దీపికా పడుకొనే పట్ల చాలా ఆకర్షితులయ్యారు. అందుకోసం ఈమెకు ఒక ఆఫర్ ను కూడా ఇవ్వడం జరిగింది కానీ దీపిక పడుకొని మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించిందట. తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో దీపిక పడుకొనే మాట్లాడడం జరిగింది. హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమే కానీ నేను ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ సినిమాలు పైన నటించాలని మక్కువ చూపించలేదు. చిన్న సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో నటించాలని లేదని తెలియజేసింది దీపికా పడుకొనే.
హాలీవుడ్ లో చిన్న ఆఫర్ అయినా కూడా ప్రపంచం మొత్తం చూసే సినిమా అని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ దీపిక పడుకొనే మాత్రం చిన్న వేషాలకోసం ఇక్కడి మంచి చిత్రాలను ఆఫర్లను వదులుకోను అంటూ తేల్చి చెప్పింది. దీంతో హాలీవుడ్ ఆఫర్ లను చాలా సున్నితంగా తిరస్కరించింది. ప్రియాంక చోప్రా కూడ మొదట చిన్న చిన్న పాత్రలను చేసుకుంటూ ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగింది అందుకే దీపికా కూడా ఇంగ్లీష్ సినిమా లో వచ్చిన ఆఫర్లను తిరస్కరించకుండా చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: